ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరీరం బరువును తగ్గించుకోండిలా

national |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 12:54 PM

చాలా మంది వయసుకు మించిన బరువు ఉంటారు. అది ఆరోగ్యానికి హానికరం. అందుకే శరీర బరువును తగ్గించుకోవాలి. డైటింగ్‌ చేయకుండా, తిండి మానేయకుండా శరీరం బరువు తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఆహారంలో ఉప్పు, చక్కెరను వీలైనంత తక్కువగా వాడేలా చూసుకోవాలి. ఎక్కువ ఉప్పు తీసుకుంటే శరీరంలో నీరు నిలుపుకునే సమస్య ఏర్పడి శరీరంలో వాపు సమస్య వస్తుంది. ధాన్యాల కన్నా చక్కెరలు మన శరీరంలో కొవ్వును 5 రెట్లు వేగంగా పెంచుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. అందుకని ఉప్పు, చక్కెరలు తగ్గించడం ద్వారా శరీరం బరువును తగ్గించుకోవచ్చు.


ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంది పంచదార కలపిన జ్యూసులు, సోడా, ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. దాంతో శరీరంలో అదనంగా మరింత కొవ్వు ఏర్పడుతుంది. అలా కాకుండా నీళ్ళను ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. నీళ్లు తాగడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తంలోని సోడియం నిల్వలు పల్చబడతాయి. నీళ్లు ఒకేసారి ఎక్కువగా తాగకుండా కొంచెం కొంచం తాగుతూ ఉండాలి.


సరైన ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. నిత్యం ఒకే సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి. ప్లేట్‌ లో సమతుల్య ఆహారం ఉండేలా చూడాలి. నిత్యం పండ్లు తినడం మంచిది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఆకలి వేయకుండా శరీరం బరువు తగ్గించుకోవచ్చు.


నిద్ర కూడా శరీరం బరువును నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నిద్ర లేకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో బరువును నియంత్రించే లెప్టిన్ అనే హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఊబకాయం వేగంగా పెరుగుతుంది. అందుకని ప్రతిరోజూ 6 నుంచి 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.


శరీరం బరువు తగ్గించుకోవాలంటే రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. అవి శరీరం బరువు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. ఇంటి పనులను చేయడం ద్వారా చాలా క్యాలరీలు కరిగించుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com