తమిళనాడులో బీజేపీ నేత కేటీ రాఘవన్ వీడియో కాల్ చాటింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీ సభ్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేటీ రాఘవన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఫిర్యాదు చేశారు. తీవ్ర రాజకీయ దుమారం నేపథ్యంలో తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవికి కేటీ రాఘవన్ రాజీనామా చేశారు. గతేడాది బీజేపీలో చేరిన యూట్యూబర్ మదన్ రవిచంద్రన్ తన యూట్యూబ్ ఛానల్(మదన్ డైరీ)లో దాదాపు 20 నిమిషాల నిడివిగల ఈ వీడియోను అప్ లోడ్ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాష్ట్రంలోని పార్టీ నేతలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను బయటపెట్టేందుకు తాను ఈ వీడియో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు రవిచంద్రన్ చెప్పుకొచ్చారు.