ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్మీడియట్‌ విద్యా క్యాలెండర్‌ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 25, 2021, 12:11 PM

ఏపీలో ఇంటర్‌ విద్యకు సంబంధించి 2021-22 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ బోర్డు క్యాలెండర్‌ విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 188 పనిదినాలున్నాయి. సెకండియర్‌ విద్యార్థులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన బోర్డు ఈనెల 16 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్టియర్‌ విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఈ ఏడాది ఆన్‌లైన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీని ఈనెల 27వ తేదీ వరకు బోర్డు పొడిగించింది. అడ్మిషన్లు పూర్తయిన అనంతరం సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులను ప్రారంభించనుంది.


ఇంటర్‌ బోర్డు క్యాలెండర్‌ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో 47 సెలవు దినాలున్నాయి. అన్ని రెండో శనివారాలు పనిదినాలుగానే ఉంటాయి. టర్మ్‌ సెలవులు లేవు. వేసవి సెలవుల్లో అన్ని యాజమాన్యాల్లోని జూనియర్‌ కళాశాలలను మూసి ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు అన్ని ఆదివారాలు, పబ్లిక్‌ సెలవు దినాలను తప్పనిసరిగా పాటించాలి.


తాత్కాలిక షెడ్యూల్ ఇదే..


ఫస్ట్ టర్మ్ : 2021 సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 18 వరకు


మొదటి యూనిట్ టెస్ట్ : 2021 అక్టోబర్


రెండో యూనిట్ టెస్ట్: 2021 నవంబర్


మూడో యూనిట్ టెస్ట్: 2021 డిసెంబర్ 12 నుంచి


సెకండ్ టర్మ్: 2021 డిసెంబర్ 20 నుంచి 2022 ఏప్రిల్ 23 వరకు


మూడో యూనిట్ టెస్ట్: 2022 జనవరి


నాలుగో యూనిట్ టెస్ట్: 2022 ఫిబ్రవరి


ఫ్రీ ఫైనల్ పరీక్షలు: 2022 ఫిబ్రవరి చివరి వారం


థియరీ పబ్లిక్ పరీక్షలు: 2022 మార్చి మొదటి వారంలో


చివరి పనిదినం: 2022 ఏప్రిల్ 23


వేసవి సెలవులు: 2022 ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు


అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ - 2022 మే చివరి వారంలో


2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం - 2022 జూన్ 1 నుంచి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com