ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాను జయించిన వారిపై బ్లాక్ ఫంగస్ పంజా!

national |  Suryaa Desk  | Published : Sat, May 08, 2021, 04:03 PM

కరోనా కొత్త మ్యూటెంట్లు ఓ వైపు టెన్షన్ పెట్టిస్తుంటే మరో వైపు కొవిడ్ విజేతలపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఇటీవల ఈ తరహా కేసులు పెరుగుతున్నట్లు ఢిల్లీ, పూణే, అహ్మదాబాద్ ల్లో వైద్యులు గుర్తించారు. 'మ్యూకోర్ మైకోసిన్' గా పిలిచే ఈ వ్యాధి వల్ల బాధితుడికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో కోలుకున్న వారిలోనూ కొందరికి ఈ ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఫంగస్ సోకిన వారిలో మూడో వంతు మంది చూపును కోల్పోతున్నారు. కొంతమంది ముఖం వాపు, ముక్కు ఒకవైపు పూర్తిగా మూసుకుపోవడం, కళ్ల వాపు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి చేరితే ఛాతిలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని, ప్రారంభంలోనే గుర్తించి ఆంటీ ఫంగల్ వైద్యం అందిస్తే బాధితులను కాపాడొచ్చని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించింది. ఇక ఈ ఫంగస్ భారీ విజృంభణ లేదని నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్ తెలిపారు. కొవిడ్-19 బారిన పడిన మధుమేహ వ్యాధి గ్రస్థుల్లోనే ఈ ఫంగస్ ఇన్ ఫెక్షన్ ఉందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com