బ్లూ జెర్సీతో బరిలోకి దిగనున్న' రాయల్‌ చాలెంజర్స్‌

  Written by : Suryaa Desk Updated: Sun, May 02, 2021, 12:58 PM
 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాబోయే అన్ని మ్యాచుల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుంది. దేశంలో కొవిడ్‌ మహమ్మారి వ్యతిరేకంగా పగలు, రాత్రి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మద్దతుగా నిలిచేందుకు ప్రత్యేకంగా బ్లూ జెర్సీలో బరిలోకి దిగనున్నట్లు ఆర్‌సీబీ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. అలాగే కొవిడ్​తో పోరాడుతున్న దేశానికి అండగా నిలువనున్నట్లు పేర్కొంది. తమ వంతుగా సాయం చేయడమే కాకుండా విరాళాల సేకరణకు కృషి చేస్తామని తెలిపింది. అందుకోసం కొత్తగా తయారు చేసిన బ్లూ కలర్​ జెర్సీని రానున్న మ్యాచ్​ల్లో ధరిస్తామని, వాటిని వేలం వేయగా వచ్చిన నిధులను దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరా కోసం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.