ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ముందంజలో డీఎంకే పార్టీ స్టాలిన్

national |  Suryaa Desk  | Published : Sun, May 02, 2021, 11:45 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే హవా కొనసాగుతోంది. ప్రస్తుతం డీఎంకే 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే అధినేత స్టాలిన్ సొంత నియోజకవర్గమైన కొళత్తూర్‌లో ఆయన మొదటి నుంచి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి స్టాలిన్ 1,754 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. స్టాలిన్‌కు మొత్తం 3,199 ఓట్లు లభించగా, అన్నాడీఎంకే అభ్యర్థి రాజారాంనకు 1,445 ఓట్లు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com