కరోనా దెబ్బకు ఆఫీసులు వర్క్ ఫ్రం హోం బాట పట్టాయి. గతేడాది కాలంగా ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్‌తో సహా ఈ కొత్త వర్క్ కల్చర్ ను అనుసరించాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోం ఆయా సంస్థలకు కలిసి వస్తోంది. ఆఫీసులు తెరుచుకోని కారణంగా ఐటీ సంస్థలకు భారీగా ఖర్చులు తగ్గిపోయాయి. ఓ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో గూగుల్ సంస్థకు ఒక బిలియన్ డాలర్లు(రూ.7,400 కోట్లు) ఖర్చు తగ్గింది. వ్యయాన్ని వార్షిక ప్రాతిపదికన లెక్కించిన గణాంకాల ప్రకారం గూగుల్ కు వర్క్ ఫ్రమ్ హోం కలిసి వచ్చింది.