ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కల్యాణ్ ను ఏమని పిలవాలో తెలియడం లేదు : అనిల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2019, 06:43 PM

పవన్ కల్యాణ్ ను ఏమని పిలవాలో తెలియడం లేదని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత అని పిలుద్దామంటే పవన్ ఒక్క చోటా గెలవలేదన్నారు. హీరో అని పిలుద్దామంటే పవన్ కు సినిమాలు లేవన్నారు. మేధావి అందామంటే పవన్ కంటే పెద్ద అజ్నాని ఎవరూ లేరన్నారు. పేపర్లు చూస్తే 26న కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన విషయం పవన్ కు తెలిసేదన్నారు. ఐదేళ్లుగా పవన్ ను ప్రజలు చూస్తున్నారని, పవన్ కల్యాణ్ ఎంత మంది తాట తీశారో ప్రజలందరికీ తెలుసన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com