హర్యానాలో నేడు 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపికి చెందిన సీనియర్ నాయకుడు అనిల్ విజ్ సహా పదిమంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 8 మంది బిజెపికి చెందిన వారు కాగా, ఒకరు జన్నాయక్ జనతా పార్టీ (జెజెపి) చెందిన వారు. మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే. దీనితో హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖత్తార్‌తో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య 12కు చేరింది.