అక్రమ వలసదారులను భారత్‌కు తిప్పి పంపిన మెక్సికో

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 17, 2019, 04:43 PM
 

మెక్సిలో నివసిస్తున్న భారత్‌కు చెందిన 311 మంది అక్రమ వలసదారులను ఆ దేశం తిరిగి భారత్‌కు పంపించివేసింది. అమెరికానుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల కారణంగా వివిధ ప్రాంతాల్లో సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని నిలువరించే క్రమంలో మెక్సికో మైగ్రేషన్‌ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా భారత్‌కు చెందిన 311 మందిని తిరిగి స్వదేశానికి పంపించివేశారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. టొలుకా నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి వారిని న్యూఢిల్లికి పంపించివేసినట్లు నేషనల్‌ మైగ్రేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.