తెలుగు సినీ నటి, టీడీపీ నేత రేవతి చౌదరి బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మంగళ వారం ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలో కలుసుకుని బీజేపీలో చేరే విషయపై ఆసక్తిని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు.
విజయవాడకు చెందిన రేవతి చౌదరి.. 1998లో మిస్ విజయవాడలో ఎంపికయ్యారు. తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. శివాజీ హీరోగా ఓ సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చినా.. ఆ మూవీ విడుదల కాలేదు. తర్వాత తారకరత్న కాకతీయుడు సినిమాలో నటించారు. అలాగే మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో.. హైదరాబాద్లోని ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసేందుకు ఆమె ఆసక్తి చూపినా కాంగ్రెస్ తో పొత్తు కారణంగా అవకాశం రాలేదు.