ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ అభ్యర్థి తరఫున కుమారి ఆంటీ ప్రచారం.. మహేష్‌బాబుతో పోలుస్తూ పొగడ్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 09:01 PM

హైదరాబాద్ కుమారీ ఆంటీ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పరిచయం అక్కర్లేదు. ఓ వీడియోతో సోషల్ మీడియా సెన్షేషన్ అయ్యారు.. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. అయితే కుమారీ ఆంటీ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచాయి.. ఆమెది గుడివాడ కాగా.. తనకి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను వైఎస్సార్‌సీపీ హైలైట్ చేసింది. అయితే కుమారి ఆంటీ మరో బాంబు పేల్చారు.. తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు ఓటు వేస్తున్నానన్నారు.. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది.. ఆ తర్వాత కుమారి ఆంటీ ప్రస్తావన రాలేదు.


తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి తెరపైకి వచ్చారు. ఈసారి ఏకంగా టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం విశేషం. గుడివాడ తెలుగు దేశం పార్టీ (ఎన్డీఏ కూటమి) అభ్యర్థి వెనిగండ్ల రాముకు కుమారి ఆంటీ మద్దతు తెలిపారు. గుడివాడలోని 21, 24,25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వెనిగండ్ల రాముపై కుమారి ఆంటీ ప్రశంసలు కురిపించారు.. ఆయన మహర్షి సినిమాలో మహేష్‌బాబులా మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆ సినిమాలో మహేష్‌బాబు ప్రజల కోసం సేవ చేస్తే.. గుడివాడలో రియల్‌గా వెనిగండ్ల రాము ప్రజలకు సేవ చేస్తున్నారని పొగడ్తలు కురిపించారు.


తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని.. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చానన్నారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన గుడివాడపై ప్రేమ, మమకారంతో ఇక్కడికి వచ్చానని.. ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు.


గుడివాడలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా లేవన్నారు. వెనిగండ్ల రాముకు మంచి విజన్ ఉందని.. కష్టపడేవారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేవారికి అవకాశం ఇవ్వాలన్నారు. రాము వంటి నేతలు అధికారంలో ఉంటే.. తమలాంటి వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. గుడివాడలో వెనిగండ్ల రామును, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని, ఎన్డీఏకు అందరూ మద్దతు తెలపాలని కుమారీ ఆంటీ కోరారు. కుమారి ఆంటీ సొంత ఊరు గుడివాడ కాగా.. హైదరాబాద్‌కు ఉపాధి కోసం వచ్చారు. నగరంలో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు.ఎనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో చెరగేని ముద్రవేసిన నేత. ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన రేవంత్.. ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకుండానే అత్యున్నత స్థాయికి ఎదిగాడు. జెడ్పీటీసీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. అతి తక్కువ కాలంలోనే తనకున్న రాజకీయ చతురతతో సీఎం స్థాయికి చేరుకున్నాడు. తాజాగా.. తన పొలిటికల్ జర్నీపై రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్ కేవలం జేబులో రూ. 150తో హైదరాబాద్ వచ్చానని అన్నారు.


తాను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. జెడ్పీటీసీగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు సీఎంగా మీ ముందు ఉన్నానని చెప్పారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని రేవంత్ వ్యాఖ్యనించారు. తెలంగాణ అభివృద్దే ధేయ్యంగా వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అతి తక్కువ కాలంలోనే కేసీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నానని.. ఇక కేసీఆర్ వద్ద లాక్కోవడానికి కూడా ఏం లేదని అన్నారు.


రాష్ట్రాభివృద్ధి కోసం పోటీ పడితే కేసీఆర్‌ను స్వాగతిస్తానని చెప్పారు. నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తానన్న రేవంత్.. కాంగ్రెస్‌లో తనకు ఎవరూ ప్రత్యర్థులు లేరని అన్నారు. అందరూ తనకు సహచరులే అని వ్యాఖ్యనించారు. ముఖ్యమంత్రిగా నాకు అందరూ గౌరవం ఇస్తున్నారని.. తాను తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్దోడ్ని కాబట్టి తాను కూడా ఎవరినీ బాధపెట్టేలా మాట్లాడనని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక హరీష్ రావు కుట్ర ఉందని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు లాక్కున్నారని విమర్శించారు. కేసీఆర్ రాకపోవడం వల్ల హరీష్ రావు ఒక్కడికే లాభం జరుగుతుందని అన్నారు, తానేతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే కోరుకుంటున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com