ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డు లభించింది. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడంతోపాటు రుణాలను సద్వినియోగం చేసుకుని సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు స్త్రీ నిధి సంస్థ కృషి చేస్తున్నందున స్కోచ్ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్పై ప్రశంసలు కురిపించారు.