ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించామని, వెంటనే పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మే 1 నుంచి వీటికి సంబంధించిన జీవోలు జారీ చేస్తామని.. వచ్చే సమావేశంలో సీసీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని, పీఆర్సీ కమిటీపై సీఎంతో సంప్రదింపులు జరుపుతామన్నారు.