ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానం కిటికీ తెరవండి...గుట్కా ఉమ్మాలి...ఓ ప్రయాణికి వింత విన్నపం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 01:28 PM

ఇటీవల విమాన ప్రయాణాలలో వింతలు, విచిత్ర ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. గుట్కా ఉమ్మేందుకు విమానం కిటికీ తెరవమని కోరాడు ఓ యువ ప్రయాణికుడు. అది విని ఎయిర్‌హోస్టెస్ నవ్వాపుకోలేకపోయింది. తోటి ప్రయాణీకులు కూడా గొల్లుమని నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం గాల్లో ఉండగా.. ఓ వ్యక్తి ఎయిర్‌హోస్టెస్‌ను పిలిచాడు. ‘కిటికీ తెరువొచ్చా.. నేను గుట్కా ఉమ్మాలి’ అని ఆమెను అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె నివ్వెరపోయింది. ఆమెతో పాటు తోటి ప్రయాణీకులు నవ్వుతూ కనిపించారు. ఆ యువకుడు తన చేతుల్లో ఏదో నలుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.


గోవింద్ శర్మ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ‘మీ గుట్కా ప్రియులను ట్యాగ్ చేయండి’ అని రాసుకొచ్చాడు. కామెంట్ బాక్స్‌లో నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేశారు. ‘కాన్పూర్ విమానాలు ఈ ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేశాయి’ అని ఓ యూజర్ రాశారు. మరో నెటిజన్ ‘గుట్కా మేటర్స్’ అని రాశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com