నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మక్తల్ మండలంలోని పసుపుల గ్రామం వద్ద కృష్ణా నదిలో మత్స్యకారుడి వలలో భారీ చేప చిక్కింది. సోమవారం ఉదయం నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి ఏకంగా 30కేజీల బొచ్చె రకం చేప వలలో పడింది. కృష్ణా నదిలో భారీ చేపలు చిక్కడం తరచుగా జరుగుతుందని మత్స్యకారులు చెప్పారు. భారీ చేప చిక్కడంతో జాలర్లు సంతోషం వ్యక్తం చేశారు.