తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. వారి డిమాండ్లపై మంత్రి ఎర్రబెల్లి అధికారులతో సోమవారం సమీక్ష చేపట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ను కలిశారు. అనంతరం సమ్మెపై కఠినంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపటిలోగా విధుల్లో చేరకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని జేపీఎస్లకు స్పష్టం చేసింది.