ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూవీ రివ్యూ: 'భోళా శంకర్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 11:54 AM

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' శుక్ర‌వారం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌లైంది. కోల్‌క‌తాలో టాక్సీ డ్రైవ‌ర్ శంక‌ర్ మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా కేసుల్లో పోలీసుల‌కు సాయం చేస్తాడు. ఈ క్ర‌మంలో శంక‌ర్ త‌న సొంత సోద‌రుడు కాద‌ని.. శంక‌ర్ చెల్లికి తెలుస్తుంది. శంక‌ర్ ఎవ‌రు? ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మిగ‌తా క‌థ‌. సినిమాకు చిరు, కీర్తి సురేష్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ కాగా.. చిరు ఎంట్రీ, కామెడీ, ప్ల‌స్ పాయింట్స్. ఓవ‌రాల్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న భోళా శంకర్.. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలిచింది.


కథ: శంకర్ (చిరంజీవి) తన సోదరి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి కోల్‌కతా వస్తాడు. బతుకుదెరువు కోసం టాక్సీ నడుపుతుంటాడు. అయితే నగరంలో ఓ మాఫియా ముఠా అమ్మాయిలను కిడ్నాప్ చేసి విక్రయిస్తూనే ఉంటుంది. పోలీసులు వారిని పట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో శంకర్ (చిరంజీవి) మాఫియాను టార్గెట్ చేస్తాడు. శంకర్ ఆ మాఫియాను ఎందుకు టార్గెట్ చేసాడు?, ఆ మాఫియాతో శంకర్‌కి గత సంబంధం ఏమిటి?, మధ్యలో లాయర్ లాస్య(తమన్నా)తో శంకర్ ట్రాక్ ఏమిటి?, చివరికి శంకర్ ఆ మాఫియాను అంతం చేశాడా?, లేదా ? అన్నది మిగతా కథ.


ప్లస్ పాయింట్లు: హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా మరియు భారీ భావోద్వేగాలతో కూడిన మెగా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ భోళా శంకర్‌లోని కొన్ని అంశాలు మాత్రమే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్‌తో పాటు కథలోని మెయిన్ కోర్ ఎమోషన్ కూడా బాగుంది. అలాగే మెగాస్టార్ పాత్రలోని షేడ్స్, తమన్నాతో సన్నివేశాలు, ఫ్లాష్ బ్యాక్.. ఆ ఫ్లాష్ బ్యాక్ లోని ఎమోషనల్ సీక్వెన్సులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా మెగాస్టార్ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి.


చిరు కూడా మెగాస్టార్‌ని రఫ్ మరియు మాస్ అవతార్‌లో అద్భుతంగా పోషించాడు. ఇక కీర్తి సురేష్ చెల్లి పాత్రకు ప్రాణం పోసింది. మరో క్యామియో క్యారెక్టర్‌లో సుశాంత్ కూడా బాగానే చేశాడు. తమన్నా గ్లామర్ ఆకట్టుకుంది. ప్రధాన పాత్రలో మురళీ శర్మ నటన చాలా సెటిల్‌గా ఉంది. శ్రీముఖిది చెప్పుకోదగ్గ పాత్ర. అందంతో పాటు అభినయం కూడా ఆకట్టుకుంది. రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి తదితర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.


మైనస్ పాయింట్లు: శంకర్ – మహాలక్ష్మి పాత్రలు, కథా నేపథ్యంతో పాటు ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల అభినయం బాగున్నాయి. కానీ సెకండాఫ్‌లో పాత్రల మధ్య భావోద్వేగాలు పండినప్పటికీ... కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తుంది. అంతే కాకుండా సినిమా స్థాయికి తగ్గట్టుగా కామెడీ కోసం అక్కడక్కడా క్యారెక్టర్లు ఎక్కువై అనవసర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిషోర్‌తో కామెడీ సీన్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు.


సెకండాఫ్‌లోనూ కొన్ని చోట్ల ఆట నెమ్మదిగా సాగింది. ప్రధానంగా కొన్ని కీలక సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నేరేషన్ మిస్ అయింది. దీంతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా రొటీన్ గా సాగాయి. విలన్లు, హీరోల మధ్య సంఘర్షణ కూడా బలంగా ఉండాలి. ఓవరాల్‌గా దర్శకుడు మెహర్ రమేష్ ఈ భోళా శంకర్‌ని పూర్తిగా ఆకట్టుకునే రీతిలో మౌల్డ్ చేయలేకపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com