బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా, టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ గురించి ప్రేమ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఊ విషయంపై వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్దం సైతం నడిచింది. అయితే తాను RP పేరుతో పెడుతున్న పోస్టులు రిషబ్ పంత్ ను ఉద్దేశించి కావని, RP అంటే టాలీవుడ్ హీరో రామ్ పోతినేని అని ఊర్వశి రౌతేలా వెల్లడించింది. క్రికెటర్ రిషబ్ పంత్ ను కూడా RP అంటారనే విషయం తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చింది. కాగా, రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఊర్వశి రౌతేలా నటిస్తున్న విషయం తెలిసిందే.