ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్-త్రివిక్రమ్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 02:46 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను మే 31, 2022న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజున రివీల్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి 'అర్జునుడు' అనే టైటిల్ ని లాక్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com