ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RC15' సినిమా పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 02:43 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, RC15 సినిమా మార్చి 2023లో వేసవిలో థియేట్రికల్ విడుదల కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com