పాన్ ఇండియాలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో “సలార్” ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మన ఇండియన్ సినిమా దగ్గర రానున్న మరో యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, గత కొంతకాలంగా ఈ సినిమా భారీ టీజర్ లేదా గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది మే నెలలోనే రావాల్సి ఉంది కానీ ప్రస్తుతానికి వాయిదా పడినట్లే వినిపిస్తోంది. మరి ఈ జూన్లో రివీల్ అవుతుందనేది ఇప్పుడు బజ్. అయితే ఈ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అప్పుడే వస్తుందో చూడాలి.