ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USA బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తున్న 'సర్కారు వారి పాట'

cinema |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 12:48 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకి అభిమానులు, సినిమాప్రేమికులు అండ్ సెలబ్రిటీల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా USA బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు  సమాచారం. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com