ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజీఎఫ్ టీం కన్ఫ్యూజ్ అవుతుందా?లేక ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తుందా?

cinema |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 12:48 PM

ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి 2 తర్వాత బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా, దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా కేజీఎఫ్2 ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఈ ఫ్రాంచైజీ నుండి మరో సినిమా రావాలని ప్రేక్షకులు, కేజీఎఫ్ అభిమానులు తీవ్రంగా కోరుకుంటున్నారు. కేజీఎఫ్ 2విడుదలకు ముందు కూడా ఈ సినిమాకి కొనసాగింపు ఉండదు, ఫ్రాంచైజీని ముగిస్తున్నాం అంటూ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. కానీ సినిమాలో మాత్రం కేజీఎఫ్ 3 సినిమా ఉండొచ్చన్న చిన్న హింట్ ను వదిలారు. ఇదే విషయాన్ని రాఖీభాయ్ ను ఒక ఇంటర్వ్యూలో అడిగితే, కేజీఎఫ్ 3 సినిమా తప్పకుండా ఉంటుంది. కానీ ఎప్పుడన్నది నాకు కూడా తెలియదు...అంటూ తెలిపారు. తాజాగా కేజీఎఫ్ 3 సినిమా ఈ ఏడాది చివరి నుండి పట్టాలెక్కనుందనే వార్తలు జోరుగా ప్రచారం చేయబడ్డాయి. ఈ విషయాన్ని కేజీఎఫ్ ఫ్రాంచైజీ నిర్మాత, హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ అధినేత విజయ్ కిరంగదుర్ స్వయంగా తెలిపారని అన్నారు. కానీ, హోంబలే ఫిలిమ్స్ మరో నిర్మాత అలాంటిదేమీ లేదు... కేజీఎఫ్ 3 సినిమా నిజంగా పట్టాలెక్కితే, మేమే అధికారికంగా ప్రకటిస్తాం... అని చెప్పుకొచ్చారు. కేజీఎఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తాజాగా కేజీఎఫ్ 3 విషయంపై స్పందించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ పైనే దృష్టి సారించారు. కేజీఎఫ్ 3 మూవీ పై వస్తున్న పుకార్లను నమ్మకండి.... అంటూ చెప్పాడు. ఒకరేమో  కేజీఎఫ్ 3 సినిమా అదిగో స్టార్ట్ అవుతుంది అంటుంటే, మరొకరేమో అవన్నీ పుకార్లంటూ కొట్టిపారేస్తున్నారు. అసలేం జరుగుతుంది? అభిమానుల ముందు కేజీఎఫ్ చిత్రబృందం ఎందుకు ద్వంద్వ ప్రమాణాలను ప్రయోగిస్తోంది. చూస్తుంటే, కేజీఎఫ్ చిత్రబృందంలో సరైన కమ్యూనికేషన్ లేదనిపిస్తోంది. అందువల్ల, కేజీఎఫ్ 3 విషయంలో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com