తన ఇద్దరు హీరోలు వీరేనని, వీరిద్దరూ కలసి ఉన్న అపూర్వ చిత్రం లండన్ లో తనకు దొరికిందని చెబుతూ, పవన్ ఓ అపురూప చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామిలు కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించుకుంటున్న ఈ చిత్రం తనకు లండన్ లోని అంబేద్కర్ హస్ లో కనిపించగా, దాని కాపీని తీసుకున్నానని చెప్పారు. వీరిద్దరూ సమాజంలో అసమానతలను తొలగించాలన్న ఉద్దేశంతో తమ తుది శ్వాస వరకూ పోరాడారని కొనియాడారు. వీరిద్దరూ తన ఫేవరెట్ వీరులని చెప్పాడు.