హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్న హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరుడు (పీఏ) బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. బాలాజీతో పాటు ఇంకా 19 మందిని అరెస్టు చేసినట్లు పోలీస్ వారి సమాచారం. వారి వద్ద నుంచి రూ.1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పోలీస్ వారు తెలియపరిచారు.