పద్మ శ్రీ అవార్డు మన తెలుగు వారికీ ఈ సారి బాగానే వరించింది అని చెప్పుకోవాలి . గరికపాటి నరసింహారావు, సుంకర ఆదినారాణరావు లాంటి వారితో పాటు ఏపీకి చెందిన నాదస్వర విద్వాంసులు దివంగత శ్రీ గోసవీడు షేక్ హసన్ గారిని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. భద్రాచలంతో పాటు మరెన్నో హిందూ దేవాలయాల్లో ఆస్థాన నాదస్వర విద్వాంసులుగా షేక్ హసన్ గారు సేవలందించి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.