పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట గ్రామానికి చెందిన గ్రామ వాలంటీరు చంద్రకాంత్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు. కొన్నాళ్ల కిందట చంద్రకాంత్ కు వివాహ నిశ్చితార్థం అయ్యింది. మంగళవారం పాత టీవీని అమ్మేసి కొత్తది తేవాలని తండ్రిని కోరాడు. దీనికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.