మధ్యప్రదేశ్లోని ఇండోర్ నియోజవర్గంలో బిలావలి ప్రాంతానికి చెందిన రేషమ్ బాయ్ తన్వర్ అనే 90 ఏళ్ల బామ్మ కారు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు డ్రైవింగ్ చేయడం ఇష్టం అని ఆమె చెబుతోంది. కార్లతో పాటు ట్రాక్టర్లు కూడా నడపగలనని రేషమ్ బాయ్ తన్వర్ చెప్పారు. తన కుమార్తె, కోడలు సహా తమ కుటుంబ సభ్యులందరూ డ్రైవింగ్ చేస్తారని, వారిని చూసి తానూ డ్రైవింగ్ నేర్చుకున్నానని తన్వర్ తెలిపారు. ఈ వీడియోను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తన ట్విటర్లో షేర్ చేశారు. వృద్ధాప్యంలో డ్రైవింగ్ నేర్చుకొని చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిందని బామ్మను ప్రశంసించారు.