హువావే సబ్ బ్రాండ్ హానర్ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. హానర్ 30 లైట్, హానర్ ఎక్స్10 మ్యాక్స్ పేరుతో వీటిని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. వీటికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ రెండిట్లోనూ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్లను అందించారు. ఈ మోడళ్లు 22.5W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తాయి. 5జీ ఫీచర్ కూడా ఈ మొబైల్ లో ఇందులో ఉంది.
ధరలు..
ఇందులో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699(సుమారు రూ.18,000)గా ఉంది. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను 1,899 యువాన్లు(సుమారు రూ.20,100), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,199 యువాన్లు(సుమారు రూ.23,300) నిర్ణయించారు. మిడ్ నైట్ బ్లాక్, ఫాంటం సిల్వర్, సమ్మర్ రెయిన్ బో, విజర్డ్ ఆఫ్ ఓజ్(గ్రీన్) రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
హానర్ ఎక్స్10 మ్యాక్స్..
ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,099 యువాన్లు(సుమారు రూ.22,200), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,499 యువాన్లు(సుమారు రూ.26,500) నిర్ణయించారు. లైట్ స్పీడ్ సిల్వర్, ప్రోబింగ్ బ్లాక్, రేసింగ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
హానర్ 30 లైట్ ప్రత్యేకతలు
ఈ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో డైమెన్సిటీ 800 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ర్యామ్ ను అందించారు. 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్లు ఉన్నాయి.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 5జీ, బ్లూటూత్ వీ5.0, వైఫై, 4జీ ఎల్టీఈ, జీపీఎస్/గ్లోనాస్/బైదు ఫీచర్లు ఉన్నాయి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 22.5W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఇందులో ఉన్నాయి. 30 నిమిషాల్లో 53 శాతం చార్జింగ్ ఎక్కుతుంది. దీని బరువు 192 గ్రాములుగా ఉంది.