ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ బావ బ్రదర్ అనిల్‌కు రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2020, 12:05 PM

జగన్ బావ, సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా బద్రర్ అనిల్ కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న పొలాల్లో దూసుకెళ్లింది. అయితేకారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ఆయనతో పాటు... గన్ మేన్, డ్రైవర్‌కు పలు గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న జగ్గయ్య పేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సాధినేని ఉదయభాను వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ అక్కడ్నుంచి తన పర్యటనకు వెళ్లిపోయినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com