అసెంబ్లీ గేట్ల దగ్గర సెక్యూరిటీ సిబ్బందితో అసభ్యంగా మాట్లాడిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు జిల్లాలో ఓ వాడుక పదాన్ని తాను గతంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తే టీడీపీ నేతలు రచ్చ చేశారని, అలాంటిది ఇప్పుడు ఏకంగా బాస్టర్డ్, యూజ్ లెస్ ఫెలో అంటూ ప్రభుత్వ ఉద్యోగుల్ని తిట్టడాన్ని ఎలా చూడాలని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర గర్హనీయం అని అన్నారు మంత్రి అనిల్. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంత దిగజారి మాట్లాడటం సరికాదని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు.