ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానంతో హూస్టన్‌లోని ప్రముఖ చెఫ్, ప్రవాస భారతీయురాలైన కిరణ్ వర్మ.. ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసారు. పైగా వీటికి ‘నమో థాలి’ అంటూ పేరు పెట్టారు. భారతీయ కాలమాన ప్రకారం హూస్టన్‌లో ప్రసంగం పూర్తయ్యాక వీటిని ప్రధాని ఆరగించారు. నమో థాలి మిఠాయి, నమో థాలి సూరి అనే రెండు రకాల వంటకాలను భోజన ప్రియుల కోసం అందిస్తున్న ఈ వంటకాలు స్వచ్ఛమైన నేతితో తయారు చేసామని, ప్రధాని మెనూలో వీటిని ఉంచడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఎక్కువగా భారత్ లో లభించే శ్రీఖండ్, రసమలై, క్యారట్ హల్వా, బాదం హల్వా తదితరాలు వివిధ రకాల పచ్చళ్లు కూడా కిరణ్ వర్మ... నమో థాలి మిఠాయిలో ఉండగా. నమో థాలి సూరిలో కిచిడీ, కచోరి, మేతి, తెప్లా ఉన్నాయి. భారత్ లో వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం చెందిన వంటలను ప్రధాని మోడీ మెనూలో చేర్చామని, మోడీపై ఉన్న అభిమానంతోనే తాను ఈ విధమైన వంటకాలను సిద్ధం చేసినట్లు కిరణ్ వర్మ తెలిపారు.