ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్‌ నెలాఖరుకు తుది ప్రణాళిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 12:54 AM

 -అమరావతి పరిపాలన నగర తుది ప్రణాళికను సిద్ధం 


 -ముఖ్యమంత్రికి ఫోస్టర్‌ అండ్గ పార్టనర్స్‌ వెల్లడి 


 -శాఖమూరులో అంబేద్కర్‌ విగ్రహం


 (అమరావతిసూర్య ప్రధాన ప్రతినిధి) : ఏప్రిల్‌ నెలాఖరులోగా అమరావతి పరిపాలన నగర తుది ప్రణాళికను సిద్ధం చేస్తామని ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ చెప్పారు. పరిపాలన భవన సముదాయాల నిర్మాణ ఆకృతులు కూడా ఆ లోగా సిద్ధం కానున్నాయని వారు తెలిపారు. రెండు రోజుల క్రితం సమర్పించిన విస్తృత ప్రణాళికపై అన్నివర్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలను తీసుకుని అందులో ఆచరణాత్మక సూచనలను తుది ప్రణాళికలో పొందుపరచి ప్రభు త్వానికి అందజేస్తామని అన్నారు. ఈలోగా ప్రణాళిక రూపకల్పనలో పురోగతిని వారం వారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎప్పటికప్పుడు తెలియపరుస్తామని చెప్పారు. సచివాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిటీ సమావేశంలో ఫోస్టర్‌ ప్రతినిధి క్రిస్‌ బబ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వివరాలు అందించారు. పరిపాలన నగరం మీదుగా నిర్మించా లనుకుంటున్న జల మార్గం, అందుకు అవసరమైన నీరు, అందుబాటులో వున్న పాలవాగు తదితర జల వనరులు, రాజధాని భవిష్యత్‌ జల అవసరాలు, ప్రభుత్వం పులిచింతల ప్రాజెక్టు దిగువన నిర్మించబోయే బ్యారేజ్‌ నుంచి వచ్చే నీరు.. వీటన్నింటి గురించి జల వనరుల శాఖ అధికారులు, హరిత, జల సంప్రదింపుల సంస్థల నిపుణులు (బ్లూ, గ్రీన్‌ కన్సల్టెంట్లు), అనుభవజ్ఞులతో చర్చించి తుది ప్రణాళికలో స్పష్టమైన రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఫోస్టర్‌ అండ్గ పార్టనర్స్‌ ప్రతినిధులకు సూచించారు. నీటిని శక్తిప్రదాయినిగా అభివర్ణిస్తూ, దాన్ని ప్రణాళికాయుతంగా వినియోగించుకుంటే మేలు జరుగుతుందని, నిర్లక్ష్యం చేస్తే వినాశం చేస్తుందని అన్నారు. రాజధానిలో క త్రిమ జల మార్గం కంటే సహజసిద్ధమైన నీటి ప్రవాహం వుండాలని, అప్పుడే తాజా నీటి సోయగంతో రాజధానికి అదుేతమైన శోభ చేకూరుతుందని చెప్పారు. ప్రస్తుతం వున్న జల వనరులు ఏడాదిలో మూడు మాసాలు మ్త్రామే అందుబాటులో వుంటాయని, చుట్టూ వున్న జల వనరులన్నింటినీ అనుసంధానం చేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించాలని అన్నారు. రాజధానిలో పరిపాలన నగరం మీదుగా వెళ్లే జల మార్గంలో నీటి ప్రవాహ మట్టం ఎంత ఎత్తున వుండాలన్నది కూడా కీలకమేనని, నిపుణులతో అన్ని కోణాల్లో చర్చించి నిర్ణయానికి రావాల్సి వుంటుందని చెప్పారు. పరిపాలన నగరంపై ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ తాజాగా అందించిన విస్త త ప్రణాళికపై రాష్ర్టమంతటా చర్చ జరగాలని, దీనిపై కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు దీన్ని చర్చనీయాంశం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రత్యేకంగా ఒక నోడల్‌ అధికారిని నియమించి దీని బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. మారు మూల గ్రామాల ప్రజలకు సైతం ఈ ప్రణాళికల గురించి తెలియాలని, అందరి అభిప్రాయాలను తెలుసుకున్నప్పుడే ప్రజారాజధాని తుది ప్రణాళికకు సంపూర్ణత వస్తుందని అన్నారు. శనివారం దీనిపై శాసనసభ ఆవ రణలో శాసనసభ్యులకు ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర జాతీయ ముఖ్యులకు ఈ ప్రణాళికను చూపించి వారి అభిప్రాయాలను తెలుసుకుందామన్నారు. నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఇతరులకు ప్రణాళికపై ప్రెజెంటేషన్‌ ఇచ్చామని, వారు చేసిన కొన్ని ముఖ్యమైన సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో ఐకానిక్‌ కట్టడంగా నిర్మించనున్న హైకోర్టును నవ నగరాలలో ఒకటైన న్యాయ నగరంలోనే నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఫోస్టర్‌ తాజా ప్రణాళికలను సోషల్‌ మీడియాలో అందుబాటులో వుంచామని, నెటిజన్ల నుంచి వస్తున్న వివిధ రకాల అభిప్రాయాలను పరిశీలించేందుకు ఒక బ ందం పని చేస్తోందని చెప్పారు. విహంగ వీక్షణ ద్వారా చూస్తే రంగురంగుల పుష్పాలతో ‘అమరావతి’ అనే అక్షరాలు కనిపించేలా రాజధానిలో ఒక ప్రత్యేక భారీ ఉద్యా నం ఏర్పాటు చేయాలన్న ఒక మంచి సూచన వచ్చిందని కమిషనర్‌ తెలుపగా, దానిపై హరిత సంప్రదింపుల సంస్థ నిపుణులతో చర్చించాలని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలోని అన్ని ప్రముఖ ఆర్కిటెక్టు కళాశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులతో రెండు, మూడు రోజులలో ఒక కార్య గోష్టి నిర్వహిస్తున్నామని కమిషనర్‌ తెలిపారు. రాజధానిలో రహదారుల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ఊపందుకోవాలని, రాష్ర్టం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అమరావతిలో ఎక్కడ చూసినా నిర్మాణ కార్యకలాపాలు శరవేగంగా సాగుతున్న దృశ్యాలు కనిపించాలని అన్నారు. నదీ అభిముఖ ప్రాంతాన్ని ప్రజల ఆహ్లాదం కోసం వినియోగించాలని, ఇక్కడే భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం జరగాలని చెప్పారు.  అత్యంత ఆధునిక, నవీన, చారిత్రక సంస్కృతి వారసత్వ మేలు కలయికగా రాజధాని నగరం నిర్మిస్తున్నామని, తుది ప్రణాళిక దీనికి తగ్గట్టుగానే వుండాలని ముఖ్యమంత్రి ఫోస్టర్‌ బ ందానికి చెప్పారు. దేశంలో ఐటీ పరిశ్రమ అభివ ద్ధి గురించి చూపాల్సివచ్చినప్పుడు  హైదరాబాదులో తాము నిర్మించిన హైటెక్‌ సిటీ చిహ్నాన్నే చూపుతారని చెబుతూ, మనం నిర్మించుకుంటున్న రాజధాని నగరం రానున్న కాలంలో ఇండియాకు గర్వకారణమైన నగరంగా మారగల దన్నారు. 


శాఖమూరులో అంబేద్కర్‌ విగ్రహం


  రాజధానిలోని శాఖమూరు గ్రామాన్ని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించేందుకు అనువైన ప్రదేశంగా గుర్తించామని సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ పరిపాలన నగరానికి దారితీసే ప్రాంతంలో ఏర్పాటుచేసే ఈ విగ్రహం రాజధానికే ముఖ్య ఆకర్షణగా నిలవగలదని చెప్పారు.  ఏడాది వ్యవధిలో దీన్ని నిర్మించడానికి మెటల్‌ కోటింగ్‌తో కూడిన కాంక్రీట్‌ నిర్మాణమే మేలు అని నిర్ణయానికి వచ్చామని తెలుపగా, ప్రపంచంలో భారీ విగ్రహ నిర్మాణాలన్నీ లోహ నిర్మాణాలేనని, అంబేద్కర్‌ విగ్రహాన్ని సైతం అలాగే జీవం ఉట్టిపడేలా నిర్మించడం ద్వారా ఇది ప్రపంచ ఐకానిక్‌ నిర్మాణంగా నిలిచిపోతుందని ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ సూచించారు. దానిపై ముఖ్య మంత్రి స్పందిస్తూ నాలుగైదు మాసాలు అదనపు సమయం పట్టినా ఫర్వాలేదని, అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రపంచ ప్రసిధ్ధి పొందిన విగ్రహాల సరసన నిలిపేలా నిర్మాణం జరపాలని ఆదేశించారు. అంబేద్కర స్మృతి వనాన్ని 2019 జనవరి నాటికల్లా పూర్తిచేస్తామని నిర్మాణ ప్రణాళిక గురించి రావత్‌ ముఖ్యమంత్రికి తెలియచేశారు. ఈ సమావేశంలో రాష్ర్ట పురపాలక మంత్రి  పి నారాయణ, ఎంపీ జయదేవ్‌ గల్లా, పారిశ్రామికవేత్త ప్రభాకర్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర, మౌలిక వసతుల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com