ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శర్వానంద్ రాధ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 12:04 PM

హీరో శర్వానంద్ ప్రస్తుతం ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ చంద్రమోహన్ దర్శకత్వంలో కామెడీ మరియు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న రాధ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన భలే భలే మగాడివోయ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నది. బోజ్ పురి నటుడు రవికిషన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసింది మూవీ టీం. ఇందులో శర్వానంద్ లుక్ చాలా స్టన్నింగ్ గా ఉండడంతో పాటు లావణ్య అందాలు ఆడియన్స్ ని మతి పోయేలా చేసాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకోగా, సమ్మర్ లో ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన పాటలను ఒక్కొక్కటి డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. తాజాగా ఖాకీ చొక్కా అనే సాంగ్ ని విడుదల చేశారు . రాడాన్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com