కాలిఫోర్నియా: అమెరికాలో మాజీ యుద్ధ సైనికులు ఉంటున్న ఆశ్రమంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. ఓ సాయుధుడు అక్కడ పనిచేస్తున్న ముగ్గురు మహిళలను చంపినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం వెటరన్స్ హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆధీనంలోకి తీసుకున్న సాయుధుడు ఆ తర్వాత వారిని హతమార్చినట్లు తెలుస్తున్నది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న నాపా కౌంటీలో ఈ ఘటన జరిగింది. వెటరన్స్ హోమ్‌లో వయసు మళ్లిన యుద్ధ సైనికులు ఉంటున్నారు. యుద్ధం తర్వాత మానసిక సమస్యలతో బాధపడేవారికి అక్కడ చికిత్సను అందిస్తుంటారు. వెటరన్స్ హోమ్‌ను ప్రస్తుతం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సాయుధుడు కూడా చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.