ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదస్థితిలో మెకానిక్ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 10:54 AM

కడప రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మోహన్ కుమార్ గౌడ్ తెలిపారు. ఒంటిమిట్ట మండలం గొల్లపల్లెకు చెందిన శివరామకృష్ణ (36) రిమ్స్ పరిధిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మెకానిక్ గా పని చేసేవారు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. శివరామకృష్ణ ట్రాక్టర్ కు వాటర్ సర్వీసింగ్ చేసి బయటికి వస్తుండగా అపస్మారకస్థితిలో కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్నవారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com