ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఫోన్‌ హ్యాంగ్‌ అవుతోందా?

Technology |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 12:24 PM

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్ ల పనితీరు నెమ్మదించడం, హ్యాంగ్ అవ్వడం వంటి సమస్యలు అప్పుడప్పుడు తలెత్తుతున్నాయి. మరి ఈ సమస్యలకు గల కారణాలు ఏంటి? ఫోన్‌ పనితీరును మెరుగుపరచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- ఫోన్ లో ఎల్లప్పుడూ ఫ్రీ స్పేస్‌ ఉండేలా చూసుకోవాలి. అతిగా డాటా నిల్వ చేసుకోవద్దు. ఒకవేళ స్టోరేజీ సామర్థ్యానికి దగ్గరగా డాటా చేరుకున్నట్లయితే ఫోన్‌ నెమ్మదించడం, హ్యాంగ్‌ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. సెట్టింగ్స్‌లోకెళ్లి స్టోరేజీ సెట్టింగ్‌ లో ఫ్రీ స్పేస్‌ ఉందో చెక్ చేసుకోవాలి. ఇంటర్నెల్ స్టోరేజీ ఫుల్ అయిపోతే Settings- Storage-Cache క్లిక్‌ చేస్తే కొంచెం స్పేస్‌ ఫ్రీ అవుతుంది.

- స్మార్ట్‌ఫోన్‌లో ఏదో అవసరం పడినపుడు కొన్ని యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటాం. కానీ వాటిని తర్వాత మళ్లీ ఎక్కువగా ఉపయోగించం. అలాంటి ఓపెన్‌ చేయని యాప్స్‌ ను ఫోన్‌లో నుంచి తీసేయాలి. స్పేస్‌ వృథా అవ్వడమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ యాప్స్‌ రన్‌ అవుతూ ఉండటం వల్ల బ్యాటరీ సామర్థ్యంతో పాటు ర్యామ్‌లో కొంత స్పేస్‌ నిండిపోతోంది.

- స్మార్ట్‌ఫోన్‌లో విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్స్ ఎనేబుల్ అయితే కూడా మొబైల్‌ వేగం తగ్గిపోతోంది. కాబట్టి యానిమేషన్స్‌ను పూర్తిగా టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలి. దీని కోసం Settings-> About-> Phone-Build Number పై క్లిక్ చేయాలి. Developer అనే ఆప్షన్స్ కనిపించేంతవరకు 7సార్లు ట్యాప్ చేయాలి. తర్వాత Settings-Developer Options-Windows-Animation Scale-Animations off పై క్లిక్‌ చేస్తే యానిమేషన్‌ టర్న్‌ ఆఫ్‌ అవుతుంది.

- ఫోన్‌ను రీస్టార్ట్‌ చేసినపుడు బ్యాక్ గ్రౌండులో మెమెరీ క్లీన్ అవుతుంది. అంతేకాకుండా ఫోన్‌లో ఉన్న అప్లికేషన్స్‌ కూడా రీసెట్‌ అవుతాయి. ఫోన్ పవర్ బటన్ నొక్కి పట్టుకుంటే రీస్టార్ట్ ఆప్షన్ కనిపిస్తోంది. దీన్ని క్లిక్‌ చేస్తే ఫోన్‌ రీస్టార్ట్‌ అవుతోంది.

- సోషల్‌ మీడియా యాప్‌ల వల్ల ఎక్కువ బ్యాటరీ వృథా అయిపోతుందనుకుంటే లైట్‌ వెర్షన్‌ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

- ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను ఉపయోగించే వారు ఎప్పటికప్పుడు ఫోన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి. కొత్త సాప్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అయ్యి సిస్టమ్‌ వేగంగా పనిచేస్తోంది.

- మనం వాడే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయడం ద్వారా ఫోన్‌ పనితీరులో చాలా మార్పులు కనిపిస్తాయి. ఫోన్‌లోని అనవసరపు డేటా అంతా పోతుంది. ఫోన్‌ స్టోరేజీలో గానీ ఎస్‌డీ కార్డులో గానీ మాల్వేర్‌, బగ్స్‌, వైరస్‌లతో కూడిన హానికర ఫైళ్లు ఉన్నా డిలీట్ అయిపోతాయి.

- మీ ఫోన్‌ పనితీరును మెరుగపరిచేందుకు ఉన్న మరో అవకాశం కస్టమ్‌ రోమ్. ప్రస్తుతం మీ ఫోన్‌లో ఉన్న ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్‌ల కు బదులు మీకు నచ్చినట్లుగా ఓఎస్‌లో మార్పులు చేసుకుని ఫోన్‌ లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఈ కస్టమ్‌ రోమ్‌ మీ ఫోన్‌ తయారీ కంపెనీ నిబంధనలకు విరుద్ధం. దీనివల్ల మీ ఫోన్‌ గ్యారెంటీ, వారెంటీ పోతాయి. దీన్ని ఎక్కువగా ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలపర్స్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను పరీక్షించేవారు ఉపయోగిస్తుంటారు. ఈ కస్టమ్‌ రోమ్‌ ఇన్‌స్టాల్ చేసే ముందు మీ ఫోన్‌ లో డేటా మొత్తాన్ని తప్పనిసరిగా బ్యాకప్ చేసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com