ఎవరి చేతిలో ఓడిందో ఆమెపైనే గెలిచిన భారత బాక్సర్ లవ్లీనా.. భారత్‌కు పతకం ఖాయం

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 30, 2021, 10:36 AM
 

భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ టోక్యో ఒలింపిక్స్‌లో తన పతకం ఖాయం చేసుకున్నారు. లవ్లీనా 69 కిలోల విభాగంలో చైనా తైపీ బాక్సర్‌ను ఓడించి సెమీ ఫైనల్ చేరుకున్నారు. లవ్లీనా బోర్గోహెయిన్ 4-1 తేడాతో చైనీస్ తైపీ బాక్సర్ చెన్ నిన్-చిన్ మీద 4-1 తేడాతో గెలిచారు. దీంతో టోక్యో ఒలింపిక్‌ క్రీడల్లో భారత్‌కు మరో మెడల్ రావడం ఖాయమైంది. బాక్సింగ్ వెల్టర్ వెయిట్‌ విభాగంలో లవ్లీనా భారత్‌కు కనీసం కాంస్య పతకం తీసుకురానున్నారు. క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా ఓడించిన చైనా తైపీ బాక్సర్ చెన్ నిన్-చిన్ మాజీ వరల్డ్ చాంపియన్. ఇంతకు ముందు ఎన్నో పోటీల్లో ఆమె లవ్లీనాను ఓడించారు. లవ్లీనా 2018లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా నియెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అస్సాం బాక్సర్ లవ్లీనా సెమీ-ఫైనల్ చేరినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.