చేగువేరా జన్మించిన క్లాసికల్ బిల్డింగ్ వేలం...

  Written by : Suryaa Desk Updated: Fri, Jun 26, 2020, 02:49 PM
 

చేగువేరా... ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. అసాధారణ తెలివితేటలు, ధైర్యసాహసాలు, యుద్ధ నైపుణ్యం... ఇలా చెప్పుకుంటే పోతే ఆయన గురించి ఎంతో చెప్పుకోవచ్చు. విప్లవ వీరుడిగా, పోరాట యోధుడిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి ఆయన చేసిన పోరాటం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.


అర్జెంటీనాలోని రోసారియో నగరంలో చేగువేరా జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన... ఆ తర్వాత విప్లవ పోరాటాల వైపు మళ్లారు. రోసారియోలో ఆయన జన్మించిన క్లాసికల్ బిల్డింగ్ ఇప్పుడు వేలానికి వచ్చింది. 2002లో నిర్వహించిన వేలంపాటలో ఈ భవనాన్ని ఫ్రాన్సిస్ కో ఫరుగియా అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దీన్ని సాంస్కృతిక కేంద్రంగా చేయాలనుకున్నప్పటికీ కుదరకపోవడంతో... వేలం వేయాలని అనుకుంటున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, ఈ బిల్డింగ్ కు ఎంతో క్రేజ్ ఉంది. దీన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు.