కుప్పకూలిన విమానం..107 మంది మృతి?

  Written by : Suryaa Desk Updated: Fri, May 22, 2020, 05:35 PM
 

పాక్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నాం లాహోర్ నుంచి కరాచీకి వెళుతున్న పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కరాచీకి సమీపంలో కుప్పకూలింది. విమాన ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. కరాచీ విమానాశ్రయానికి 4 కిలోమీటర్ల సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఎవరూ కూడా క్షేమంగా బయటపడిన దాఖలాలు లేవని లోకల్ మీడియా ద్వారా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం ఎయిర్‌బస్ 320 మోడల్‌కు సంబంధించింది. దాని నంబర్ పీకే 8303. ఈ ఘటనతో అధికారలు అలర్ట్ అయ్యి సహాయక చర్యలు చేపట్టారు. ఇండ్ల మధ్య కూలడంతో పలు ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 107 మంది దుర్మరణం చెందారని సమాచారం. విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.