ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దూర​ విద్యా విధానంలో కొత్త మార్పులు

national |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2019, 09:12 PM

యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్ దూర​ విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్. హోటల్​ మేనేజ్​మెంట్​, రియల్​ ఎస్టేట్​ కోర్సులను డిస్టెన్స్​ ఎడ్యుకేషన్​ నుంచి తొలగించింది. 219-20 విద్యా సంవత్సరం నుంచి కులినరీ స్టడీస్​, హోటెల్ మేనేజ్​మెంట్, రియల్ ఎస్టేట్​ మదింపుల కోర్సులు దూర విద్యలో చేసేందుకు వీలు లేదని యూజీసీ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఓపెన్​, డిస్టెన్స్​ డ్రిగ్రీలలో ప్రవేశం పొందిన వారికి మాత్రం గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కోర్సుల పట్ల క్షుణ్నమైన అవగాహన లేకపోతే.. వృత్తిని సక్రమంగా నిర్వర్తించలేరు కనుక ఈ కోర్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com