సౌదీకి అమెరికా సైనిక బలగాలు

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 12, 2019, 04:07 PM
 

సౌదీ అరేబియాకు మరిన్ని సైనిక బలగాలను పంపినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఇరాన్ నుంచి సౌదీకి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో సైనికుల్ని, ఆయుధ సామాగ్రిని పంపుతున్నట్లు చెప్పారు. సౌదీ రక్షణ సాయాన్ని పెంపొందించడంలో భాగంగానే సైనిక బలగాలను పంపినట్లు అమెరికా పేర్కొంది. ఇరాన్ తన వ్యవహార శైలి మార్చుకుని సాధారణ దేశంగా వ్యవహరించాలని కోరింది. లేకుంటే ఆర్థికంగా తీవ్రంగా సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.