ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ ఖాతాలను తొలగించిన ట్విట్టర్

international |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2019, 10:41 AM

వాషింగ్టన్‌: అసత్య వార్తలు, ప్రభుత్వ అనుకూల వార్తలను వ్యాపింపచేసే వేలాది ఖాతాలను ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్‌ తొలగించింది. వీటిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, చైనా, స్పెయిన్‌కి చెందినవి ఎక్కువగా ఉన్నట్లుగా కంపెని తెలిపింది.చైనా నుంచి హాంకాంగ్‌లో నిరసన చేస్తున్న ఆందోళనకారుల గురించి, సౌదీకి అనుకూలంగా ఈజిప్ట్‌ నుంచి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కు అనుకూలంగా ఖతార్‌, యెమెన్‌ నుంచి అదే విధంగా స్పెయిన్‌, ఈక్వెడార్‌ నుంచి నిర్వహిస్తున్న నకిలీ ఖాతాలను తొలగించినట్లు ట్విటర్‌ ఒక ప్రకటనలో తెలిపింది.


'హాంకాంగ్‌ నిరసనకారులపై వార్తలు వ్యాపింప చేస్తున్న 4302 నకిలీ ఖాతాలను తొలగించాం.అవి చైనాకు చెందినవిగా భావిస్తున్నాం' అని ట్విటర్‌ తెలిపింది. గత ఆగస్టులో కూడా ట్విటర్‌ హాంకాంగ్‌లో నిరసనలకు ఆజ్యం పోస్తున్న చైనాకు చెందిన 2,00,000 నకిలీ ఖాతాలను తొలగించింది. ప్రభుత్వ వ్యక్తులు ట్విటర్‌ని ఉపయోగించి ప్రజలపై ఏ విధంగా ప్రభావం చూపగలుగుతున్నారో తెలుసుకోనే పనిలో భాగంగా కంపెనీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. గత నెలలో ఫేస్‌బుక్‌ కూడా ఈజిప్ట్‌, సౌది అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, లిబియా, సుడాన్‌, యెమెన్‌ నుంచి ప్రముఖ మత స్థావరాల గురించి తప్పుడు వార్తలు వ్యాపింప చేస్తున్న పలు నకిలీ ఖాతాలను తొలగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com