ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైట్లీ ఆర్థిక విధానాల‌ను త‌ప్పుప‌ట్టిన సుబ్ర‌మ‌ణ్య‌స్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 02:45 PM

హైద‌రాబాద్‌: మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రూపొందించిన త‌ప్పుడు ఆర్థిక విధానాల వ‌ల్లే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా మారింద‌ని బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తెలిపారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రంజ‌న్‌ను కూడా సుబ్ర‌మ‌ణ్య‌స్వామి త‌ప్పుప‌ట్టారు. ర‌ఘురాం రంజ‌న్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచడాన్ని రాజ్య‌స‌భ ఎంపీ ఖండించారు. పుణెలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అధిక స్థాయిలో ప‌న్నులు వ‌సూలు చేయ‌డాన్ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి త‌ప్పుపట్టారు. జైట్లీ స‌మ‌యంలో ఆ విధానాల‌ను రూపొందించార‌న్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com