ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో భూకంపం!

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 09:52 PM
 

ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇవాళ ఉద‌యం భూకంపం సంభ‌వించింది. ఒడిశాలోని మ‌యూర్‌బంజ్ జిల్లాలో భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. రాయిరంగ్‌పుర‌, బిసోయ్‌, గోరుమ‌హిసాని, బ‌హ‌లాదా ప్రాంతాల్లో ఉద‌యం 6.20 నిమిషాల‌కు ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది.జార్ఖండ్‌లోనూ 4.4 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. ఖ‌ర‌సావ‌న్‌, స‌రైకేలా, ఘ‌ట్‌షీలా, దుమారియా, గురాబండ ప్రాంతాల్లో ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యింది.అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచారం లేదు.