టీ కూడా సొంత డబ్బులతోనే...దట్ ఈజీ దీదీ...!!

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 07:55 PM
 

ఈ తరం పొలిటిషియన్స్ కు భిన్నంగా వ్యహరించడమే ఆ ముఖ్యమంత్రి నైజం. ప్రజాధనమంటే సొంత ఖజానా కాదు... అధికారం అంటే దర్పం ప్రదర్శించేందుకు వచ్చిన బంపర్ ఆఫర్  కాదు... నిరాడంబరతకు ఆ జీవితం నిలువెత్తు నిదర్శనం. ఆ జీవితం ఇతరులకు ఆదర్శననీయం.. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి.. అనుకుంటున్నారా ..? అందరూ దీదీగా పిలుచుకునే పశ్చిమ బెంగాల్ సీఎం మమత.
ఆమె స్టైల్ ఆమెదే...గత ఎనిమిదేళ్లుగా ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ఇప్పటి వరకు సర్కారు ఖజానా నుంచి తన సొంత అవసరాలకు ఒక్కరూపాయి వాడుకోలేదంటే నమ్మగలరా ? కానీ ఇది నమ్మలేని నిజం. ఈ గొప్పతనం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకే దక్కుతుంది. బెంగాలీ ప్రజలకు బెబ్బులిగా... దేశ ప్రజలకు దీదీగా చిరపరిచితురాలైన మమతా బెనర్జీది మొదటి నుంచి సాధారణ జీవితం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తన తీరును ఏమాత్రం మార్చుకోలేదు. ఆమె స్టైల్ ఆమెదే...మమతకు పెన్షన్‌గా నెలకు లక్ష...సీఎంగా జీతం మరో లక్ష రూపాయలు వస్తుంది. కానీ జీతం నుంచి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు విత్‌డ్రా చేయలేదు. కనీసం కారు కొనుక్కోలేదు. బిజినెస్‌ క్లాస్‌ విమానంలో ప్రయాణించ లేదు. అతిథి గృహంలో ఉంటే సొంత డబ్బులే ఖర్చు చేసుకుంటారు. ఆఖరికి టీ తాగినా ఆమె తన సొంత డబ్బులే వెచ్చిస్తారట.