అనంతపురం జిల్లా, కొత్తచెరువు మండలంలోని పోతులకుంట గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి ఆదివారం సాయంత్రం అదే గ్రామంలోని ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అతన్ని స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఇందిరా తన సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకుని బాధిత మహిళ, గ్రామస్థులతో విషయం తెలుసుకుంది. రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.