‘దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రికి వచ్చే సామాన్య భక్తులందరికీ సులువుగా అమ్మ దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి అనధికార దర్శనాలను కట్టడి చేయాలని నిర్ణయించాం. వీఐపీలకు ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించాం. కోటా ప్రకారమే రోజుకు 2 వేల వరకు వీఐపీ టికెట్లు ఇస్తాం. ఈసారి బందోబస్తులో సెక్టార్ల విధానాన్ని తీసుకొచ్చాం.’ అని పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు పేర్కొన్నారు.