ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలకు దిగిన దళిత సంఘాల నాయకులు, వైసీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 04:44 PM

కడపలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వినోద్‌కుమార్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. బద్వేలు నెల్లూరు రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వే కోడూరులో దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన వ్యక్తంచేసి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్‌ విగ్రహంపై దాడి సిగ్గుచేటని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు యమలాసుదర్శనం మదనపల్లెలో ఖండించారు.  కర్నూలులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.మధుసూధన్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఏఎండీ ఇంతియాజ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, సీనియర్‌ నాయకులు గడ్డం రామక్రిష్ణ తదితరులు నిరసనలో పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com